16 ఏళ్ళ అమ్మాయిపై 6 నెలలుగా.. 5 మంది యువకులు అత్యాచారం..
posted on Jul 30, 2021 @ 3:14PM
దేశంలో రోజురోజుకు ఎక్కడ చూసిన మహిళల ఆవేదనలు.. ఆక్రందన.. మహిళలపై , చిన్న చిన్న బాలికలపై వరసలు లేవు.. కూతురుని చెరబట్టిన తండ్రి.. స్నేహితురాలిని వేధించిన ఫ్రెండ్.. అక్కకు గర్భం చేసిన తమ్ముడు.. ఆఫీస్ లో బోస్ లైంగిక వేధింపులు.. ఇలా అన్ని రకాలుగా ఆడవాళ్లు వంచనకు గురవుతూనే ఉన్నారు.. వారిపై దాడులు రోజు రోజుకి పెరుగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు, జీవోలు తీసుకువచ్చినా దుర్మార్గాలు శిక్షలు పడిన నిత్యం మహిళలపై ఎదావిదిగా దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6నెలల పాటు ఆ ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె నగ్నంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 6 నెలలు నరకం చూసిన ఆ అమ్మాయి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అనుకుంది అందుకే నోరు మెదపలేదు. చివరకు ధైర్యం చేసుకొని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువకులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌పై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారం ఘటనను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను ఎదావిదిగా అతడి స్నేహితులకు పంపించాడు. అదే అదును అనుకున్న ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తమ దగ్గర ఉన్న వీడియో వైరల్ చేస్తామని సదరు బాలికను భయపెట్టి ఐదుగురు యువకులు కలిసి 6 నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే అత్యాచారం చేసిన వీడియోలను బయట పెడతామని హెచ్చరించారు. ఈ బాధలను భరించలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆ ఘటన మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ లో చోటు చేసుకుంది.
రాత్రి విందుకు పిలిచి.. అశ్లీలంగా వీడియోలు తీసి..
30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. అనే పుస్తకాలూ చూసే ఉంటారు.. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చూసే ఉంటారు. ఐతే ఇది ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థం ఐంది. ప్రజల మైండ్ లో కూడా అన్ని చాలా తొరగా జరిగిపోవాలి.. ఇలా అనుకుంటే అలా జారిపోవాలి. అనే మైండ్ సెట్ తో ఉన్నారు ప్రజలు అన్నింటికంటే ముందు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని ఆలోచిస్తుంటారు.. అందుకోసం ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొంత మంది యువతులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హనీట్రాప్ కేసులు బయటకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే కర్నాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మంగుళూర్‌లోని ఉళ్లాల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సప్నా, అఫ్రీన్ అనే యువతులు నివాసం ఉంటున్నారు. వారి పక్క ఫ్లాట్‌లో ఓ వ్యాపారవేత నివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న సదరు వ్యాపారవేత్తను యువతులు రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. ఆ రోజున అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో సప్నా అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. ఒక్కసారిగా షాకైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ పోలీసులు అరెస్ట్ చేశారు.